May 14, 2026, 17:05 IST/బాల్కొండ
బాల్కొండ
రైతు సమస్యల పరిష్కారానికి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ లో పర్యటన
May 14, 2026, 17:05 IST
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో వడ్ల కళ్ళల్లో రైతు ధాన్య రాశుల వద్దకు వెళ్లి, రైతు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ మరియు డీఎస్ఓ ఉన్నతాధికారులతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేంతవరకు పోరాటం ఆగదని, రైతు కష్టం తెలిసిన నాయకుడిగా రైతు సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నారని తెలిపారు. ఈ పర్యటనలో ఆయన రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.