బోధన్ - Bodhan

సాఠాపూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం: ఎలక్ట్రీషియన్ కు తీవ్ర గాయాలు

సాఠాపూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం: ఎలక్ట్రీషియన్ కు తీవ్ర గాయాలు

ఎడపల్లి మండలంలోని సాఠాపూర్ గేటు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా మాలపల్లికి చెందిన మొహమ్మద్ ఫరూక్ అబ్దుల్లా అనే ఎలక్ట్రీషియన్ కోటగిరిలో పని ముగించుకొని నిజామాబాద్ తిరిగి వస్తుండగా, సాతఠాపూర్ గేటు వద్ద బైక్ పై నుండి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవకుమార్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని వైద్యులు అభినందించారు.

వీడియోలు


నిజామాబాద్ జిల్లా
జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం: ఐదుగురికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం
Jun 17, 2026, 11:06 IST/బాల్కొండ
బాల్కొండ

జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం: ఐదుగురికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం

Jun 17, 2026, 11:06 IST
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని భీంగల్ మండలంలో, రహత్‌నగర్ గ్రామానికి చెందిన నలుగురు, సికింద్రాపూర్ గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారుకు జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఈ ఉత్తర్వులను అందజేశారు. కుటుంబ పోషకుడిని కోల్పోయిన పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా అధికారులు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.