193 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

970చూసినవారు
193 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం బోధన్ పట్టణంలోని శ్రీ నివాస్నగర్లోని సాయి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ బియ్యం కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలో, ఒక లారీలో 193 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి, లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ హనుమాన్ పంచనామా నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్