బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా గొడవ పడుతున్న ఆరుగురిని బోధన్ పోలీసులు సోమవారం కోర్టుకు హాజరుపరిచారు. న్యాయ అధికారి శేషతల్ప సాయి వారికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. పట్టణ సీఐ వెంకట నారాయణ ఈ వివరాలను తెలిపారు. అలాగే, గోశాల ఏరియాలో మట్కా నిర్వహిస్తున్న షేక్ రసూల్ కు రూ. 5వేల జరిమానాతో పాటు 4 రోజుల జైలు శిక్ష, అయుబ్ తన ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపినందుకు రూ. 5వేల జరిమానాతో పాటు వారం జైలు శిక్ష విధించారు.