వర్షలు కురవాలంటు జాన్కంపేట్ గ్రామ ఆలయాలలో అభిషేకాలు

1చూసినవారు
బోధన్ మండలం జాన్కంపేట్ గ్రామంలో శుక్రవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులు ఆలయాలలో గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభు లింగేశ్వర ఆలయం, హనుమాన్ ఆలయం, మహాలక్ష్మి ఆలయం, గ్రామదేవతలకు ఈ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనురాధ రాధా కిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాధా కిషన్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్