మంగళవారం నాడు నవీపేట మండలంలోని మోకనపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో ఉదయం 6 గంటలకే పాఠశాలకు చేరుకున్న అధికారులు, 2024-25 సంవత్సరానికి మంజూరైన పీఎంశ్రీ నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అదనపు గదుల నిర్మాణానికి రూ. 34 లక్షలు మంజూరు కాగా, మరో మూడు లక్షల ఖర్చులకు సరైన రసీదులు లేవని అధికారులు గుర్తించారు. ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది.