బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఒక ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి. పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.