నిజామాబాద్ జిల్లాలో సిసిఎస్ టీం పేకాట స్థావరాలపై, పిడిఎస్ రైస్ దాడులపై మెరుపు దాడులు నిర్వహించింది. పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు, సిసిఎస్ ఇన్చార్జ్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఎడపల్లి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ARP క్యాంప్ నందు పేకాట స్థావరంపై రైడ్ చేసి, ఇద్దరు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, నగదు 30,000/- స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.