నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ భూముల రీ-సర్వే (భూ భారతి) కార్యక్రమంపై గ్రామ సభ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు భూముల రీ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ఈ సదస్సుకు సహాయ సంచాలకులు, సర్వే మరియు భూ రికార్డుల శాఖ, నిజామాబాద్, బోధన్ తహసిల్దార్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, దాము, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్లం, సర్వే శాఖ అధికారులు, రైతులు మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.