కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ద్వారాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరిచి, సంప్రోక్షణ, మహా హారతి నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.