బోధన్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి 35వ వార్డు నుండి, ఆమె భర్త తూము శరత్ రెడ్డి 25వ వార్డు నుండి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారం (30వ తేదీ)తో ముగియనుంది. శుక్రవారం నాడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ వార్త రాసే సమయానికి నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.