సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, రాష్ట్రీయ సమన్వయ దివాస్‌ను పురస్కరించుకుని బోధన్ గ్రామీణ పోలీసులు శుక్రవారం ఉదయం 3K రన్ నిర్వహించారు. సాలూర మండలం సాలూర క్యాంప్ నుండి జాడి గ్రామం వరకు జరిగిన ఈ పరుగులో పోలీసులు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడవలసిన ఆవశ్యకతను ఎస్సై మచ్చేందర్ రెడ్డి యువతకు వివరించారు.