సాలూర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు

867చూసినవారు
సాలూర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు
తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో, మహారాష్ట్ర నుంచి అక్రమ ధాన్యం రవాణాను అరికట్టేందుకు సాలూర ఆర్టీవో చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. బోధన్ రూరల్ పోలీసుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ చెక్‌పోస్ట్ ద్వారా అక్రమ రవాణాను అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్ర ధాన్యం తెలంగాణ మార్కెట్లలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. తగిన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్