గత ఆరు నెలలుగా బోధన్ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాజ్ విటల్ ఆరోపించారు. 16వ వార్డులో ప్రభుత్వ స్థలమైన సీసీ రోడ్డును ఒక వ్యక్తి కబ్జా చేసి మెట్లు వేసుకున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో బోధన్ మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని, హైకోర్టును ఆశ్రయించినా, నోటీసులు పంపినా పూర్తి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.