కులగణన సర్వేలో దరఖాస్తులను ఆన్లైన్ చేసిన నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని బీఆర్ఎస్ మండల యువజన విభాగం నాయకులు గంగా ప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. కోటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన నాయకులు, ఒక్కో దరఖాస్తుకు సుమారు ₹50 ఇస్తామని హామీ ఇచ్చి పనులు చేయించుకున్నారని, సంవత్సరం గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు.