మొక్క జొన్న పంట దగ్ధం

0చూసినవారు
సాలూరు మండలం ఖాజాపూర్ గ్రామంలో చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిద్రపు వెంకటేష్‌కు చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న, చిద్రపు భాస్కర్‌కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటలు కాలి బూడిదయ్యాయి. పక్క పొలంలో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టేందుకు పెట్టిన నిప్పు గాలికి అదుపుతప్పి మొక్కజొన్న కుప్పలకు వ్యాపించడంతో ఈ దుర్ఘటన జరిగింది. రైతులు తమ కష్టార్జితం కళ్లముందే నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :