నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డిఓ కార్యాలయం వద్ద అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాలో నకిలీలను అరికట్టాలని, రైతులు పండించిన పంటలకు సరైన ధర నిర్ణయించాలని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, పుట్టి నడిపి నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పార్వతి రాజేశ్వర్ లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.