రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 56 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.