నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ తాహెర్ బిన్ హాందన్ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, పట్టణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాము, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.