బోధన్ లో ఘనంగా దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకలు

2చూసినవారు
బోధన్ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్, దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో దేశద్రోహానికి పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నైజాం పాలనలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జెండా గద్దె వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్