కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు

12చూసినవారు
కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు
కురుమ సంఘం, బోధన్ పట్టణ కమిటీ, కురుమఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో , దొడ్డు కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చేసిన కృషిని గుర్తుచేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కురుమ ఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద విద్యార్థినికి సైకిల్ 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను చైర్పర్సన్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు ఐటీ వింగ్స్ సభ్యులు పేట శ్రీనివాస్ జె శ్రీనివాస్ శివ కుమార్ శంకర్ సుశాంత్ అనిరుద్ తదితరులు పాల్గొన్నారు