హున్సాలో పిడిగుద్దులాట..

1చూసినవారు
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని హున్స గ్రామంలో 125 ఏళ్లుగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట ఆనవాయితీగా కొనసాగుతోంది. బుధవారం గ్రామ శ్రేయస్సు కోసం కుల, మతాలకు అతీతంగా ఐక్యతతో ఈ ఆట ఆడనున్నారు. పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, గ్రామస్థులు ఐక్యతతో నచ్చజెప్పి, గ్రామానికి నష్టం వాటిల్లుతుందని ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తాతల కాలం నాటి నుంచి ఈ పిడిగుద్దులాటను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు.