బోధన్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిక

1586చూసినవారు
బోధన్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరిక
బోధన్ పట్టణంలోని మాజీ కౌన్సిలర్ మిద్దెల రామరాజుతో పాటు పలువురు బీజేపీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగేశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగేశ్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, దాము, పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, తలారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you