బోధన్ శాసన సభ్యుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ చేసిన అనుచిత వాక్యాలు, ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని సాలుర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. రెండేళ్లుగా విదేశాల్లో ఉండి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని, వరద సమయంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అప్పుడు ఉండి ఉంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు, ప్రజలకు ఏమి చేశారో కనిపించేదని ఆయన పేర్కొన్నారు.