ఉజ్వలయోజన పథకం ద్వారా 22 మందికి ఉచితగ్యాస్ సిలిండర్లు పంపిణీ

7చూసినవారు
రెంజల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 22 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. బిజెపి నాయకులు ఎల్పీ పోచయ్య మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలు కట్టెల పొయ్యి వాడకం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశానికి మహిళలే ప్రధానమని, వారి కోసం మహిళా శక్తి సంఘాలు కూడా ఏర్పాటు చేశారని, నూతనంగా పెళ్లయిన వారు, తల్లిదండ్రులతో విడిగా ఉంటున్నవారు, భారతదేశంలో ఎక్కడ ఉన్నా దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా సిలిండర్లు పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.