బోధన్ లో గురుకుల పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

839చూసినవారు
బోధన్ లో గురుకుల పాఠశాల నిర్మాణానికి భూమి పూజ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బెలాల్ ఫారం గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ.200.00 కోట్ల అంచనా వ్యయంతో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గురుకుల పాఠశాల నిర్మాణంతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్