శ్రీమహాలక్ష్మి ఆలయం రెండు గదుల నిర్మాణానికి భూమి పూజ

2255చూసినవారు
శ్రీమహాలక్ష్మి ఆలయం రెండు గదుల నిర్మాణానికి భూమి పూజ
బోధన్ నియోజకవర్గం జానకంపేట గ్రామంలో శుక్రవారం మహాలక్ష్మి ఆలయంలో రెండు గదుల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. సర్పంచ్ అనురాధ రాధా కిషన్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల అంచనాతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మిద్దెల నరేందర్, మిద్దెల చిన్నయ్య కుటుంబ సభ్యులు తమ సొంత స్థలాన్ని ఆలయానికి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాధా కిషన్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్