వెయ్యి రోజుల పాలనలో బోధన్ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకురాలేదు

3చూసినవారు
వెయ్యి రోజుల పాలనలో బోధన్ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకురాలేదు
వెయ్యి రోజుల పాలనలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ ఆరోపించారు. మంగళవారం బోధన్ లోని తన నివాసం లో మీడియా తో మాట్లాడారు. ఇప్పటికీ తమహయంలో మంజూరు అయిన అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని వివరించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన 22/a పార్ట్ బి దేశం లోనే పెద్ద స్కాం గా ఆయన అభివర్ణించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఒక్క బోధన్ పట్టణం లోనే 3500, ఇళ్లను పార్ట్ బి నిషేధిత జాబితాలో చేర్చారని వివరించారు. ఈ అంశం పై ఆందోళనకు పూనుకొంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అయా మండలాల, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్