మోస్రాలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ విడతలో 19 మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు మార్కింగ్ కూడా చేశారు. వర్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేసి, బిల్లులను సకాలంలో పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.