బోధన్ లో శనివారం పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ. 500 చొప్పున, బావర్చి హోటల్ కు రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ వాడకం మానుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, దత్త రావు పాల్గొన్నారు.