నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

1551చూసినవారు
భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో మంజీరా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బోధన్/సాలూర ప్రాంతంలో మంజీరా నది ఒడ్డున ఉన్న మందర్న, ఖాజాపూర్, హుంసా, సాలూర, తగ్గేల్లీ గ్రామాల్లోని సోయా, వరి పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని విడుదల చేయడంలో ఎస్సారెస్పీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్లే తమ పంట పొలాల్లోకి నీరు వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.