నవీపేట మండల శివారులో మంగళవారం రాత్రి వన భోజనాలకు వెళ్లిన బిల్లి రాకేశ్ అనే వ్యక్తి తాగిన మైకంలో ఒకరిపై బీరు సీసాతో దాడి చేసినట్లు ఎస్సై వినయ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నవీపేటకు చెందిన సాధక్ అలీ అనే యువకుడు బిల్లి నరేశ్ వద్ద కొంత కాలంగా మేకల కాపరిగా పని చేస్తున్నాడు. బిల్లి నరేశ్ బంధువులతో కలిసి వన భోజనాలకు వెళ్లగా వరుసకు సోదరుడైన బిల్లి రాకేశ్ మద్యం మత్తులో సాధక్ అలీతో గొడవ పడి బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.