బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గురువారం స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బోధన్ మండలం మందర్న గ్రామానికి చెందిన వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఎమ్మెస్సీ ఫారం గ్రామం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు నివేదిస్తామని ఎస్సై ముత్యాల రామ తెలిపారు. గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై ట్రాలీ ఆటోలు, టాటా ఏస్, బొలెరో వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.