ప్రమాద మృతి బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

4చూసినవారు
ప్రమాద మృతి బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
బోధన్ నియోజకవర్గం భిక్నెల్లి గ్రామపంచాయతీలో పనిచేస్తూ, గతంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బాగారే యాదు, బాగారే బాలాజీల కుటుంబసభ్యులకు అధికారులు ఇచ్చిన హామీల అమలు కోసం టీయూసీఐ నాయకులు బి మల్లేష్, కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 11న భిక్నెల్లి గ్రామానికి చెందిన జిపీ కార్మికులు బాగారే యాదు, బాగారే బాలాజీలు ట్రాక్టర్ పై రాంపూర్ గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంటు స్తంభాలను తీసుకువస్తుంటే మార్గమధ్యంలో ట్రాక్టర్ బోల్తా పడి స్తంభాల కింద పడి మృతి చెందారని, వారి కుటుంబసభ్యులను ఆదుకుంటామని ప్రకటించి ఏడాది గడిచిందని, హామీలను అమలు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్