బకాయిలు చెల్లించాలని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా

0చూసినవారు
బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు తమ వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ శనివారం ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు, MIM కౌన్సిలర్లు, ఆప్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని తెరిపిస్తామని, బకాయిలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. MIM ఎమ్మెల్యే ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్