బోధన్ పట్టణంలో ఫిట్నెస్ లేని స్కూల్బస్సులను ఎంవీఐ శ్రీనివాస్ తనిఖీలు చేశారు. రోడ్లపైకి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా తమ స్కూల్ బస్సులను తనిఖీలు చేయించాలని సూచించారు. బోధన్ డివిజన్లో 90 బస్సులు ఉన్నాయని, కొన్ని బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదన్నారు.