
ఢిల్లీ, కశ్మీర్లో భూప్రకంపనలు
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో శనివారం రాత్రి 7 గంటలకు భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు భూప్రకంపనలు వచ్చాయి. ఈశాన్య అఫ్గానిస్తాన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కి.మీ. దూరంలో, 215 కి.మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పాక్, చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్‌లో కూడా భూప్రకంపనలు వచ్చాయి.




