విద్యార్థుల సమస్యలపై జూలై 10న రాష్ట్రవ్యాప్త బంద్

5చూసినవారు
విద్యార్థుల సమస్యలపై జూలై 10న రాష్ట్రవ్యాప్త బంద్
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల వంటి సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్త బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బోధన్ డివిజన్ కేంద్రంలోని PRTU భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో AIPSU జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, PDSU జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్ కుమార్ లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్