లింగాపూర్లో ఆత్మహత్య లేఖ కలకలం

4చూసినవారు
లింగాపూర్లో ఆత్మహత్య లేఖ కలకలం
నవీపేట్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు (36) అనే వ్యక్తి, తన చావుకు భార్య కవితతో పాటు అత్తగారి కుటుంబ సభ్యులే కారణమని లేఖ రాసి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం పోలీసులకు లభించిన లేఖలో, దుబాయ్‌లో 13 ఏళ్లు పనిచేసి సంపాదించిన డబ్బుల లెక్కలు భార్య సరిగా చెప్పడం లేదని, తనపైనే కేసు పెట్టించిందని పేర్కొన్నాడు. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు, విడాకులు ఇస్తానని బెదిరించడం వంటి కారణాలను లేఖలో తెలిపాడు.

ట్యాగ్స్ :