నిజామాబాద్: తీన్మార్ మల్లన్న నీ తీరు మార్చుకో: బీఆర్ఎస్ నాయకులు

58చూసినవారు
నిజామాబాద్: తీన్మార్ మల్లన్న నీ తీరు మార్చుకో: బీఆర్ఎస్ నాయకులు
ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు. మల్లన్న ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని హితవు పలకారు. కార్యక్రమంలో పార్టీ ఇన్ ఛార్జ్ గాండ్ల మధు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్