ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. రేపు, అనగా మంగళవారం, 03-03-2026న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, దేవాలయం ఉదయం 6 గంటలకు తెరిచి, అభిషేక కార్యక్రమం అనంతరం 7 గంటలకు మూసివేయబడుతుంది. మరుసటి రోజు, బుధవారం, 04-03-2026న ఉదయం 6 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకుంటుంది. శుద్ధి కార్యక్రమం, సంప్రోక్షణ తర్వాత ఉదయం 9 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని ఆలయ కార్యనిర్వహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.