మోస్రా మండల కేంద్రంలోని దర్గా వద్ద నిజామాబాద్ కు చెందిన ముదిగేపల్లి లక్ష్మి తన బంధువుల వద్దకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో దర్గా దర్శనానికి వెళ్ళగా, గుర్తు తెలియని మహిళ ఆమె పర్సులోని రూ. 23 వేలను లాక్కొని పారిపోయింది. ఈ ఘటనలో లక్ష్మి స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. ఆమె కుమారుడు ముదిగేపల్లి సాయికుమార్ వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.