నవీపేట మండలంలోని ఆశాజ్యోతి కాలనీకి చెందిన మేకల సాయిలు (60) కనిపించడం లేదని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం బయటకు వెళ్లిన సాయిలు ఇంటికి చేరుకోలేదని, ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల కారణంగానే అతను వెళ్లి ఉంటాడని భావిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.