గడువులోగా ఎస్సై ఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి

3చూసినవారు
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ఎన్యుమరేషన్ ప్రక్రియను బోధన్ ఆర్డీవో విజయకుమారి మంగళవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట్, ఎడపల్లి గ్రామాల్లో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను నమోదు చేస్తున్న బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న పనితీరును ఆమె నిశితంగా పరిశీలించారు. అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో మాట్లాడి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్