తండాలో 8వ వార్డుకు పోటీ శూన్యం.. గ్రామంలో ఎస్సీ జనాభా సున్నా

3చూసినవారు
నవీపేట్ మండలంలోని మట్టయ్యఫారం తండా 8వ వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గ్రామంలో మొత్తం ఎనిమిది వార్డులు ఉండగా, ఏడు వార్డులకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డు ఎస్సీ జనరల్కు కేటాయించగా, గ్రామంలో ఒక్క ఎస్సీ కుటుంబం కూడా లేకపోవడంతో అక్కడ నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన ఏడు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్