
గల్ఫ్ దేశాలకు విమానాల రద్దు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే 45 విమానాలు రద్దు అయ్యాయి. దోహా, జెడ్డా, ఖతార్, అబుదాబి, సౌదీ అరేబియా, కువైట్, మస్కట్, మదీనా వంటి దేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల నుంచి కూడా విమానాలు రద్దు అయినట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఆయా దేశాలు తమ ఎయిర్ స్పేస్ లను మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.




