కోటగిరి, పోతంగల్ మండలం కొడిచెర్లలో శుభ్ర వారం నాడు, ఇసుక ట్రాక్టర్ పై నుంచి పడి సాయికుమార్ (18) అనే యువకుడు మృతి చెందాడు. పని మీద నిజామాబాద్ వెళ్లేందుకు కాలినడకన బయలుదేరిన సాయికుమార్, జనుకను నింపుకొని వెళ్తున్న ట్రాక్టర్ పై లిఫ్ట్ అడిగాడు. ట్రాక్టర్ పై నుంచి ఆకస్మాత్తుగా కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించినా, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు.