బోధన్ పట్టణంలోని సాత్పుల్ వద్ద గురువారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న కారు స్ప్రింగ్ బేకరీ వద్ద ఆగి ఉన్న భార్యాభర్తలు ఆకాష్, శ్వేతలతో పాటు వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆకాష్, శ్వేతలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.