మాంజిరలో ఇద్దరు గల్లంతు... ఒక మృతదేహం లభ్యం

2చూసినవారు
పోతంగల్ శివారులోని మంజీరానదిలో గొర్రెలకు నీరు త్రాగించేందుకు వెళ్లిన పోతంగల్ మండల కేంద్రానికి చెందిన గంగొండ (48) మరియు బోర్గం గ్రామానికి చెందిన గంగారాం (43) అనే బావ బామ్మర్థులు ఇద్దరు నీటమునిగి మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్.ఐ. సునీల్, పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం, ప్రతిరోజులాగే ఉదయం గొర్రెలను మంజీరానది వద్దకు నీరు త్రాగించడానికి తీసుకెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :