బోధన్ మండలం ముట్టుపల్లి గ్రామ పరిధిలోని మోస్రా ప్రధాన రహదారిపై రాజీవ్ నగర్ తండా – ఉట్పల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామస్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.